Latest News

Powered by Blogger.
Tuesday, 2 February 2016

పింగాణీ కప్పులకు, సాసర్లకు టీ మరకలు పోవాలంటే.....

పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పోవాలంటే సోడా బైకార్బనేట్‌లో కొంచెం నీటిని కలిపి దానితో శుభ్రం చేస్తే మరకలు మాయం అవుతాయి.

కిచెన్ ప్లాట్‌ఫాం మీద కాని స్టవ్ మీద కాని జిడ్డు మరకలు ఉంటే ముందుగా కొంచెం నీటిని చల్లి సోడా బైకార్బనేట్ చల్లాలి. రెండు - మూడు నిమిషాల తర్వాత స్పాంజ్‌తో కాని ఒక కాటన్ క్లాత్ తో గాని తుడవాలి.

థర్మాస్ ఫ్లాస్కు లోపల వాసన వస్తుంటే ఒక టేబుల్ స్పూన్ సోడా బైకార్బనేట్ వేసి నిండా నీటిని పోయాలి. రాత్రి అంతా అలా ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే కడిగితే వాసనపోయి శుభ్రంగా ఉంటుంది.

కిచెన్‌లో అవెన్, స్టవ్, ప్లాట్‌ఫాం తుడిచే స్పాంజ్‌లు, బ్రష్‌లు కొన్ని రోజులు వాడిన తరవాత వాసన వస్తూ ఉంటాయి. నీటిలో ఒక టేబుల్‌ స్పూన్ సోడాబైకార్బనేట్, నాలుగు చుక్కల డిష్‌వాష్ లిక్విడ్ వేసి కలిపి ఆ స్పాంజిలను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి శుభ్రం చేయాలి.

ఫిజ్‌ను శుభ్రం చేయాలంటే లీటరు నీటిలో ఒక కప్పు సోడా బైకార్బనేట్ కలిపి ఆ మిశ్రమంలో స్పాంజ్‌ను ముంచి లోపలి అరలన్నీ తుడవాలి. తరవాత మంచినీటిలో ముంచి పిండేసిన స్పాంజ్‌తో మరొకసారి తుడవాలి.

స్టెయిన్‌లెస్ స్టీల్ సింకులో రెండు స్పూన్ల సోడా బైకార్బనేట్ చల్లి కొంచెం నీటిని చల్లి రుద్ది కడిగితే కొత్త దానిలా మెరుస్తుంది.

వెండి వస్తువులు నల్లబడకుండా ఉండాలంటే వాటిని భద్రపరిచే చోట కర్పూరం బిళ్ళలు ఉంచాలి.

వరిపిండి, శనగపిండి లాంటివి కవర్‌లో వేసి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

చిటికెడు వంటసోడాను టీ కప్పులలో వేసి నిమిషం తరవాత శుభ్రపరిస్తే లేయర్‌లా ఏర్పడిన టీ మరకలు మటుమాయం అవుతాయి.

పిండివంటలు చేసిన తరవాత చుట్టుపక్కల ఏర్పడిన జిడ్డు మరకలు పోవాలంటే- వాటి మీద కొద్దిగా ఏదయినా పొడి పిండి జల్లి పేపర్‌తో తుడిస్తే సరిపోతుంది.

      • Title : పింగాణీ కప్పులకు, సాసర్లకు టీ మరకలు పోవాలంటే.....
      • Posted by :
      • Date : 10:41 am
      • Labels :
      • Blogger Comments
      • Facebook Comments
      Top