అనేక చర్మ వ్యాధులకు చికిత్సలో పసుపు బాగా ఉపయోగపడుతుంది. పాలలో పసుపు పొడిని వేసి పేస్టుగా చేయాలి. ఈ పేస్ట్ ని అవాంచిత రోమాలు ఉన్న చోట రాయాలి. ఆ తర్వాత 20 నిమిషాలకు గోరువెచ్చని నీటితో కడగాలి . ఈ విధంగా కొద్ది రోజుల పాటు చేస్తే ఆ రోమాలన్నీ తొలగిపోతాయి.
కందిపప్పును రాత్రివేళ నానపెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ పప్పును గ్రైండ్ చేసి, మెత్తని పేస్టులా తయారుచేయాలి. ఈ విధంగా తయారుచేసిన కంది పేస్టులో చెక్కు తీసిన బంగాళా దుంపల గుజ్జును కలపాలి. దానిలో రెండు తాజా నిమ్మకాయల రసం వేసి బాగా కలపాలి. ఒక టీ స్పూను తేనె కూడా కలపాలి, ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాల పైన అంటించి అర గంట తర్వాత నీటితో తడిపి తీసివేయాలి. ఈ విధంగా 15 రోజులకు ఒకసారి చేయాలి.
బాగా నూరిన అరటి పండును మెత్తని గు.జ్జుగా చేసి, రెండు చెంచాల ఓట్‌మీల్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని అవసరమైన చోట చేతి వేళ్లను చన్నీళ్లలో ముంచి 15- 20 నిమిషాలు గుండ్రంగా తిప్పుతూ రుద్ది కడగాలి. వారానికి రెండు మూడుసార్లు ఈ విధంగా చేస్తే, అవాంఛిత రోమాల సమస్య తొలగిపోతుంది.
ఒక బౌల్ లో పంచదార , నిమ్మరసం, తేనెను సమ భాగాల్లో తీసుకోని బాగా కలిపి , సన్నని మంటపై రెండు మూడు నిమిషాల పాటు వేడిచేసి, పల్చగా, నున్నగా జారేట్టు అయ్యాక చల్లార్చాలి. అవసరమైన భాగాలను శుభ్రపరిచి వెంట్రుకలు వచ్చే దిశగా రాసి, ఆ పేస్టు పైన గుడ్డను అంటించి, వెంట్రుకలు పెరిగే దిశకు వ్యతిరేకంగా లాగితే, వెంట్రుకలు వెంటనే ఊడి వస్తాయి.
నువ్వుల నూనెను గానీ, పల్లీనూనెను గానీ, అవాంఛిత రోమాలపై రాసి, ఆ భాగాన్ని బాగా మసాజ్ చేసి మెత్తని శెనగ పిండిని రాసి బాగా నొక్కి నలుగు పెట్టాలి. ఈ విధంగా వారానికి ఒకటి రెండు సార్లు ఇలా చేస్తే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.