బ్రౌన్ రైస్ (ఎర్రబియ్యం) - 3 కప్పులు
అటుకులు - ఒక కప్పు
మినపప్పు - ఒక కప్పు
పెసరపప్పు - అర కప్పు
శనగపప్పు - అర కప్పు
కంది పప్పు - అరకప్పు
మెంతులు - ఒక స్పూన్
ఉప్పు - సరిపడా
నూనె
తయారి విధానం
ముందుగా బ్రౌన్ రైస్ (ఎర్రబియ్యం), మినపప్పు , పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు అన్నింటిని శుభ్రంగా కడిగి రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం అటుకులను ఒక గంట పాటు నానబెట్టాలి. రాత్రి నానబెట్టుకున్న బియ్యం,పప్పులు,అటుకులు అన్ని కలిపి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిలో సరిపడా ఉప్పు,నీరు పోసి దోశల పిండి మాదిరిగా కలుపుకొని గంటల పాటు అలా వదిలేయాలి. (ఇలా చేస్తే పిండి పులుస్తుంది. అప్పుడు దోసె వేస్తే టేస్టీగా, క్రిస్పీగా వస్తుంది) స్టౌవ్ మీద పెనం పెట్టి దానిపై నూనె బాగా రాయాలి. ఆ తర్వాత గరిటతో పిండిని తీసుకుని పెనం మీద వేసి గుండ్రంగా దోసెలాగా వేయాలి. అప్పుడు మంటను మీడియంలో పెట్టి.. దోసెకు రెండువైపులా బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకు కాల్చుకోవాలి. అంతే నోరురుంచే బ్రౌన్ రైస్ దోశ రెడీ.