Latest News

Powered by Blogger.
Wednesday, 6 January 2016

సీజన్ కి తగ్గట్టుగా ఆహారంలో మార్పులు ఎలా చేసుకోవాలి?

సీజన్ కి తగ్గట్టుగా ఆహారంలో మార్పులను చేసుకుంటూ ఉండాలి. కాలానికి అనుగుణంగా ఆహారాన్ని తీసుకుంటే సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అందువల్ల ఏ కాలంలో ఏ ఆహారం తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం. కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలు జీర్ణాశయంలో ఎక్కువసేపు ఉండుట వలన ఇన్ ఫెక్షన్, డయేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల చలికాలంలో కొవ్వు పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది.

అదే విధంగా వెజిటబుల్‌ ఆయిల్స్‌ కూడా త్వరగా జీర్ణం కావు. అందుకే వాటికి బదులుగా ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ని వాడాలి. వాతావరణం చల్లగా ఉండడం వల్ల దాహం వేయదు. కానీ ఈ కాలంలో కనీసం రోజుకి ఆరు గ్లాసుల నీళ్ల్లు తాగడం శరీరానికి చాలా అవసరం.

అలాగే కొంతమంది వంటల్లో కొబ్బరి పాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే వాటిల్లో అధిక క్యాలరీలు, ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండడం వల్ల త్వరగా జీర్ణం అవ్వవు. అందుకే చలికాలంలో వాటికి బదులుగా పాలు, పెరుగు వంటి వాటిని వాడుకోవాలి.

ఇప్పుడు క్యాలీఫ్లవర్‌, క్యారెట్‌ వంటి కాయగూరల్ని ఎక్కువగా తినాలి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు శరీరానికి సరైన పోషకాలు కూడా అందుతాయి. ముఖ్యంగా ఈ కాలంలో చల్లని పదార్థాలు తినకూడదు. వేడిగా ఉండేవాటిని మాత్రమే తినాలి.
అలాగే ఎక్కువగా ఆకుకూరలతో చేసిన పదార్థాలు తీసుకోవాలి. పసుపు, దాల్చిన చెక్క, యాలకలు వంటి సుగంధద్రవ్యాలు ఆహార పదార్థాల్లో ఎక్కువగా వాడాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

  • Title : సీజన్ కి తగ్గట్టుగా ఆహారంలో మార్పులు ఎలా చేసుకోవాలి?
  • Posted by :
  • Date : 12:51 pm
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top