Latest News

Powered by Blogger.
Friday, 29 January 2016

వెక్కిళ్లు ఎందుకు వస్తాయి....దాని వెనక ఉన్న రహస్యం ఏమిటి?

వెక్ళిళ్లు అనేది ఒక జబ్బుకాదు. వెక్కిళ్లు వస్తున్నా, అన్నం తినేపుడు గొంతు సొరపోయినా ఎవరో తలుచుకొంటున్నారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వెక్కిళ్లు అనేవి అందరికీ వస్తాయి. అనియంత్రితంగా మన వూపిరితిత్తుల కింద ఉన్న ఉదరవితానం(Diaphragm) కదలడం వలన వెక్కిళ్ళు వస్తాయి. సాధారణంగా మనకు బాగా దాహం వేసినపుడు, లేదా అన్నం తినేపుడు కారం లేదా ఇతర ఘాటైన పదార్థాలు ఆహార వాహికను ప్రేరేపించినపుడు వూపిరితిత్తుల కింద ఉన్న ఉదరవితానం కూడా ప్రేరేపణకు గురి అవుతుంది.  మరి శ్వాస ప్రక్రియకు చెందిన ఉదరవితానానికి జీర్ణ ప్రక్రియకు సంబంధించిన ఆహార వాహికకు ఏమిటి సంబంధం?

అంటే జీర్ణాశయానికి ఉన్న కండరాలను కదిలించే నాడీ తంత్రుల్ని శ్వాస ప్రక్రియకు సహకరించే ఉదరవితానికి ఉన్న మెత్తని కండరాలను కదిలించే నాడీ తంత్రుల్ని మెదడులోని ఒకే ప్రాంతం నియంత్రిస్తుంది. అందువలన పొట్టలో ఏమైనా అనుకోని విధంగా ప్రేరేపణలు జరిగిన, పొట్టలో జరిగే ప్రతి స్పందనలు ఉదర వితానాన్ని కూడా చేరతాయి. తద్వారా శ్వాస ప్రక్రియలో ఉన్నఫలాన ఒడిదొడుకులు వస్తాయి. ఇవే వెక్కిళ్లు. కొంతసేపు ఆగితే అవే తగ్గిపోతాయి. అదే పనిగా వస్తుంటే కొంచెం మంచి నీళ్లు తాగాలి. లేదా వూపిరి బాగా పీల్చి అలాగే కొంత సేపు బిగపట్టి ఊపిరి వదలాలి.

  • Title : వెక్కిళ్లు ఎందుకు వస్తాయి....దాని వెనక ఉన్న రహస్యం ఏమిటి?
  • Posted by :
  • Date : 10:48 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top