Latest News

Powered by Blogger.
Wednesday, 2 December 2015

ముఖంపై ఏర్పడిన గుంటల సమస్య నుండి బయట పడాలంటే......

ముఖంపై గుంటలు ఏర్పడడానికి మొటిమలు ఒక కారణం అని చెప్పవచ్చు. ఆ సమస్య నుంచి బయటపడి ముఖం కాంతివంతంగా, మృదువుగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి.

కీరదోసకి చర్మాన్ని మృదువుగా చేసే గుణం ఉంది. చిన్న కీరదోస ముక్కని పేస్ట్ గా చేసుకొని అందులో కొన్ని చుక్కలు రోజ్‌వాటర్‌ ని కలిపి ముఖానికి రాసుకొని పావుగంట తరువాత శుభ్రంగా చల్లని నీటితో కడగాలి.

గుడ్డులోని తెల్లసొనలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల తెల్లసొనని ముఖానికి రాసుకొని ఆరిన తరువాత శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తుంటే మంచి పలితాన్ని పొందవచ్చు.

చర్మం మృదువుగా, కాంతివంతంగా మెరవడానికి బొప్పాయి, టొమాటో బాగా సహాయపడతాయి. వాటి గుజ్జుని ముఖానికి రాసుకొని కొంచెం సేపు మసాజ్ చేసుకొని అర గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడగాలి. ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తే ముఖ చర్మం మృదువుగా మారటమే కాకుండా కాంతి వంతంగా మారుతుంది.

శెనగపిండిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఆరాక కడిగేయాలి. ఈ విధంగా ప్రతిరోజూ చేయడం వల్ల ముఖంపై గుంటలు త్వరగా మాయం అవుతాయి.

పాలల్లో గుప్పెడు బాదం గింజల్ని రాత్రి పూట నానబెట్టాలి. మరుసటి ఉదయం వాటిని పేస్ట్‌ చేసి చర్మానికి రాసుకోవాలి. ఆరాక కడిగేసుకోవాలి. బాదంలో చర్మ సౌందర్యానికి పనికొచ్చే విటమిన-ఇ అధికంగా ఉంటుంది. అందువల్ల బాదం పేస్ట్‌ని రాయడం వల్ల ముఖం మృదువుగా అవ్వడంతోపాటు ఆకర్షణీయమైన రంగులో మెరుస్తుంది.

      • Title : ముఖంపై ఏర్పడిన గుంటల సమస్య నుండి బయట పడాలంటే......
      • Posted by :
      • Date : 6:30 am
      • Labels :
      • Blogger Comments
      • Facebook Comments
      Top