Latest News

Powered by Blogger.
Wednesday, 9 December 2015

మధుమేహం ఉన్నవారు దూరంగా ఉండవలసిన ఆహారం

రక్తంలో చక్కెరస్థాయి నియంత్రణలో ఉన్నంత వరకు మధుమేహం మనల్ని ఇబ్బంది పెట్టదు. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఏది పడితే అది తినడం మంచిది కాదు. మధుమేహం ఉన్నవారు ఎటువంటి పదార్థాలకు దూరంగా ఉండాలో ఒకసారి పరిశీలన చేద్దాం. 

వైట్‌ బ్రెడ్‌,  పాలిష్డ్‌ రైస్‌, వైట్‌ఫ్లోర్‌ లు ఎక్కువగా తినకుండా ఉండటమే మంచిది. . వీటి మోతాదు పెరిగితే షుగర్‌ లెవెల్స్‌ పెరిగే అవకాశం ఉంటుంది. వీటికి బదులు బ్రౌన్‌రైస్‌, బ్రౌన్‌ బ్రెడ్‌, గోధుమ వంటి వాటికీ ప్రాధాన్యత ఇవ్వాలి. 

పాల ఉత్పత్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇందులోని శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ చెడు కొలస్ట్రాల్  ని   పెంచుతాయి. తద్వార గుండె జబ్బుల  ముప్పు పెరుగుతుంది. కాబట్టి పాల ఆధారిత పదార్థాలైన- బటర్‌, పెరుగు, మీగడ, నెయ్యి లను మానేయటం మంచిది. వీటికి ప్రత్యామ్నాయంగా మీగడ తీసిన పెరుగు, చిలికిన మజ్జిగ, డబుల్‌ టోన్డ్‌ మిల్క్‌ వంటివి తీసుకోవటం అన్ని విధాల శ్రేయస్కరం. 

చెడుకొవ్వును పెంచే వాటిలో వేగించిన పదార్థాలు  చాలా  ప్రమాదకరమైనవి. షుగర్‌ ఉన్న వాళ్లు ఫ్రెంచ్‌ ప్రైస్‌, ఆలూ చిప్స్‌, పాపడ్‌, పకోడీ వంటి వాటికీ వెళ్లకపోవడం ఉత్తమం. నూనెలో వేగించిన పదార్థాలు తినడం వలన బరువు పెరుగుతారు. స్థూలకాయం అనేది  మధుమేహానికి ప్రధాన శత్రువు. 

శీతలపానీయాల్లో చక్కెరస్థాయి అత్యధికంగా ఉంటుంది.  ఒక్క బ్రాండెడ్‌ డ్రింక్‌లోనే ఆరు నుంచి ఏడు స్పూన్ల చక్కెర ఉంటుందని తేలింది. షుగర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉన్న పానీయాలను తాగడం వల్ల మధుమేహులకు ఇబ్బందులు ఎదురు అవుతాయి.

పండ్ల రసాల వల్ల కూడా బ్లడ్‌ గ్లూకోజ్‌ లెవెల్స్‌ ఎక్కువవుతాయి. కాబట్టి జ్యూస్‌లు మాని.. తాజా పండ్లను తినడం ప్రయోజనకరం. పండ్లలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచుపదార్థం లభిస్తుంది. జీర్ణశక్తి చురుగ్గా ఉంటుంది.

  • Blogger Comments
  • Facebook Comments
Top