Latest News

Powered by Blogger.
Monday, 14 December 2015

పాలకూర దహీవడ

కావలసిన పదార్దాలు

మినపపప్పు : 200 గ్రాములు
పాలకూర ప్యూరీ: రెండు కప్పులు
నల్లమిరియాల పొడి: టేబుల్‌ స్పూన్‌
బియ్యం పిండి: అరకప్పు 
పెసరపప్పు : 50 గ్రాములు
కిస్మిస్‌ : 50 గ్రాములు
వంటసోడా : చిటికెడు
తియ్యటి పెరుగు: కిలో
టమోటా కెచప్‌: మూడు టీస్పూన్లు
ఆమ్‌చూర్‌ పొడి: అర టీస్పూన్‌
నూనె : వేయించడానికి సరిపడినంత
కారంపొడి : టేబుల్‌ స్పూన్‌
ఉప్పు : రుచికి సరిపడ
చాట్‌ మసాలా: అరటీస్పూన్‌
తయారుచేసే విధానం

పాలకూర ఆకుల్ని శుభ్రంగా కడిగి, మరిగే నీటిలో వేసి ఒక నిమిషం ఉంచి వెంటనే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ ఆకుల్ని మిక్సీ లో వేసి మెత్తగా అయ్యేలామిక్సీ చేసుకోవాలి . ఈ  పాలకూర ప్యూరీని ఒక బౌల్ లో తీసుకోని పక్కన పెట్టుకోవాలి.  పప్పు లను విడివిడిగా నాలుగు గంటల పాటు నానబెట్టుకొని  రుబ్బుకోవాలి.  పప్పులను రుబ్బుకునేటప్పుడు కొంచెం కొంచెం  పాలకూర ప్యూరీని కలుపుతూ మె త్తగా రుబ్బుకోవాలి. ఈ  పిండిని గిన్నెలోకి తీసుకొని మిగిలిన పాలకూర  ప్యూరీని  కూడా కలుపుకోవాలి. ఆ తరువాత మిగతా పదార్థాలన్నీ వేసి చేతితో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పిండిని వడలుగా వత్తుకుని నూనెలో గోల్డ్ కలర్  వచ్చే వరకూ వేగించుకోవాలి . వడలు కొద్దిగా వేడి గా ఉన్నప్పుడే నీటిలో వాటిని రెండు నిమిషాలు ఉంచి బయటకు తీసి పెద్ద పళ్లెంలో వేసి వాటి మీద పెరుగు పోసి  దాని మీద చాట్‌ మసాలా, ఆమ్‌చూర్‌ పొడి, టమోటాసాస్‌ చల్లి  సర్వ్ చేయాలి . 

  • Blogger Comments
  • Facebook Comments
Top