ఫ్రిజ్ శుభ్రం చేయాలంటే ముందుగా అందులో ఉన్న అన్ని వస్తువుల్ని బయటకు తీసేయాలి. ఫ్రిజ్ శుభ్రం చేయడం పూర్తి కాగానే తిరిగి సర్దుకోవాలి. ఈ పని చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. అందుకే క్లీనింగ్ స్ర్పే వాడడం వల్ల తేలికగా ఫ్రిజ్ ని శుభ్రం చేసుకోవచ్చు.
ఈ స్ప్రే తయారుచేయటానికి రెండు కప్పుల నీటిలో ఒక కప్పు వెనిగర్, కొన్ని చుక్కలు నిమ్మరసం కలపాలి. దీనితో ఫ్రిజ్‌ని అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవచ్చు.
కూరగాయలు కోసే చెక్కపై కొంచెం నిమ్మరసం చల్లి, ఉప్పు వేసి నిమ్మచెక్కతో రుద్దాలి. ఆ తరువాత నీళ్లతో కడిగి ఆరబెట్టాలి. ఈ విధంగా చేస్తే దానిపై పేరుకుపోయిన దుమ్ము, జిడ్డు అంతా తొలగిపోయి శుభ్రం అయిపోతుంది.
ప్రతిసారీ క్లీనింగ్ వైప్స్ కొనాలంటే చాలా ఖర్చవుతుంది. అందుకే ఇంట్లోనే క్లీనింగ్ వైప్స్‌ని తయారు చేసుకోవడం మంచిది. దాని కోసం ఒక టీషర్ట్‌ను ముక్కలుగా కత్తిరించి ఆ ముక్కల్ని వెనిగర్, నీళ్లు, ఎసెన్షియల్ ఆయిల్ కలిపిన మిశ్రమంలో నానబెట్టాలి. వాటితో మరకల్ని సులభంగా తుడిచేయొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మంచి సువాసన కూడా వస్తుంది.
ఒక గిన్నెలో బోరాక్స్ పౌడర్, వెనిగర్, నిమ్మ లేదా బత్తాయి తొక్కలను వేసి కొన్ని గంటల పాటు నానబెట్టాలి. ఈ ద్రావణాన్ని ఒక స్ర్పే బాటిల్‌లో పోసి నిల్వ ఉంచొచ్చు. దీన్ని ఉపయోగించి వంటగది, టాయిలెట్లను శుభ్రం చేయవచ్చు.
అరకప్పు బేకింగ్ సోడాలో నాలుగు స్పూన్ల నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమంతో మైక్రో ఓవెన్ శుభ్రం చేయవచ్చు. లేదా ఒక స్పాంజ్‌ని కొద్దిసేపు లెమన ఆయిల్, నీళ్ల మిశ్రమంలో ఉంచి ఓవన లోపల తుడిస్తే కూడా మరకలు సులభంగా తొలగిపోతాయి.