చెప్పులు లేకుండాపాదాలతో నడిస్తే చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. కాళ్ళకు గాయాలు కాకుండా ఉండటమే కాకా నడక కూడా స్థిరంగా ఉంటుందట. అంతేకాక శరీర భంగిమ కూడా కరక్ట్‌గా ఉంటుందిట. అంతేకాదు శరీరాన్ని సరిగా బ్యాలెన్స్ చేసుకుంటారట.అందుకే ఇంట్లో, ఆఫీసులో, ఆరుబయట ఎక్కడ నడిచిన చెప్పులు లేకుండా హాయిగా నడవమని అంటున్నారు న్యూయార్కులోని ఇథాకా స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ హ్యూమన పెర్ఫామెన్సకు చెందిన ప్రొఫెసర్ పాట్రిక్ మెక్‌కెన.
మన కదలికలు పాదాల్లోని కండరాలను స్థిరంగా ఉండేట్టు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. అంతేకాకుండా పొత్తి కడుపులోని కండరాలపై కూడా వీటి ప్రభావం ఉంటుంది. కాళ్లలోని, పాదాల్లోని చిన్న, పెద్ద కండరాల మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. వీటి గురించి న్యూరల్ కనెక్షన ద్వారా బ్రెయినకి సమాచారం చేరుతుంది. ఇవి దెబ్బతింటే గాయాలు బాగా తగిలే అవకాశం ఉంది. అంతేకాదు షూస్ వేసుకోవడం వల్ల కూడా పాదాల కండరాల మధ్య ఉండే సహజసిద్ధమైన లింకు దెబ్బతింటుంది. షూ కింద ఉండే బిగ్ సోల్ వల్ల పాదాల సహజసిద్ధమైన సమతులత దెబ్బతింటుంది.
కండరాలు సరిగా పనిచేయకపోతే ఎముకల మీద, లిగ్మెంట్స్ మీద ప్రభావం పడి గాయాల రిస్కు పెరిగే అవకాశం ఉంది. . పాదాలు, కాళ్లు , కండరాలు దృడంగా ఉండాలంటే చెప్పులు లేకుండా నడవాలి. ఈ విధంగా చేయడం వల్ల కండరాలు బలపడతాయి. వీటితోపాటు కండరాలు గట్టిపడడానికి ప్రతి రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. కానీ చలికాలంలో మాత్రం షూస్ లేకుండా ఉత్త కాళ్లతో నడవడం, పరిగెట్టడం వంటివి చేయటం ఎంత మాత్రం మంచిది కాదు.