Latest News

Powered by Blogger.
Monday, 2 November 2015

గసగసాల పాయసం

కావలసిన పదార్థాలు

గసగసాలు - ఒక గ్లాసు
గోధుమపిండి - ఒకటిన్నర గ్లాసు
బియ్యం పిండి - రెండు స్పూన్‌లు
యాలకులు - రెండు
పంచదార - రెండున్నర గ్లాసులు
నెయ్యి - ఒక స్పూన్
నీరు - ఐదు గ్లాసులు.
తయారుచేయు విధానం

ముందుగా గసగసాలలో ఒక గ్లాస్ నీటిని పోసి మెత్తని పేస్ట్ గా తయారుచేసుకోవాలి. గోధుమపిండిని చపాతి పిండి మాదిరిగా తడిపి పెట్టుకోవాలి. పిండి అరగంట పాటు నానిన తరువాత సేమ్యా మాదిరిగా లావుగా తాల్చాలి. ఇప్పుడు ఒక పాత్రలో నాలుగు గ్లాసుల నీరు పోసుకోవాలి. నీరు మరిగాక అందులో తాల్చిన సేమ్యా వేసుకోవాలి.

కొంచెం సేపు మరిగాక పంచదార, మెత్తగా చేసుకున్న గసగసాల పేస్టు వేసుకోవాలి. తరువాత మిగిలిన నీటిని పోసి చిన్న మంటపై ఉడికించుకోవాలి.

చివరగా బియ్యం పిండిని నీళ్లలో కలిపి పోయాలి. ఒక నిమిషం అయ్యాక  నెయ్యి, యాలకుల పొడి వేసి  మీద నుంచి కిందకి దించుకోవాలి. అంతే..గసగసాల పాయసం రెడీ.

  • Blogger Comments
  • Facebook Comments
Top