ప్రతి రోజు ప్రతి ఒక్కరు తమ జీవితంలో 'ఆహారం' మరియు' న్యూట్రిషన్ ' అనే పదాల గురించి మాట్లాడుకుంటు ఉండటం సహజమే. ప్రతి ఒక్కరు గరిష్ట పోషణ ప్రయోజనాలను పొంది ఆరోగ్య వంతమైన జీవనాన్ని పొందాలని కోరుకోవటం సహజమే. అందుకే ఎక్కువ ఆహార పోషకాలతో నిండిన కలర్ ఫుల్ డైట్ గురించి తెలుసుకుందాం.
ఎరుపు
యాపిల్స్, ఎరుపు మిరియాలు, దానిమ్మలు, టమోటాలు, పుచ్చకాయ, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్. ఈ పండ్లు మరియు కూరగాయలలో 'లైకోపీన్' అనే పిగ్మెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించటం మరియు గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇవి ప్రత్యేకంగా ఆర్థరైటిస్ తో బాధపడే వారికి ఉపయోగకరంగా ఉంటాయి.
పసుపు / నారింజ
క్యారట్లు, మామిడికాయలు, నిమ్మకాయలు, పసుపు మిరియాలు, గుమ్మడికాయ, స్వీట్ కార్న్, అనాస. వీటిలో బీటా-కెరోటిన్, ఫ్లవనాయిడ్స్, పొటాషియం మరియు విటమిన్ సి సమృద్దిగా ఉంటాయి. ఈ పోషకాలు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్నితగ్గించుట మరియు కొలెస్ట్రాల్, రక్తపోటులను తగ్గిస్తాయి. ఈ ఆహారాన్ని తీసుకుంటే బలమైన ఎముకలు మరియు కీళ్ళు ఏర్పడటానికి సహాయపడతాయి.
ఆకుపచ్చ
బీన్స్, ఆకుపచ్చ ద్రాక్ష, గ్రీన్ ఆపిల్, బఠానీలు, పాలకూర, పచ్చి మిరప, దోసకాయ, బ్రొక్కోలి. వీటిలో ఉండే క్లోరోఫిల్ కారణంగా ఆకుపచ్చ రంగు వచ్చింది. వీటిలో ఉండే 'లుటీన్' కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది. అంతేకాక దీనిలో ఉండే 'ఫోలేట్' పుట్టుక లోపాల ప్రమాదంను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఈ రంగు ఆహారం గర్భిణీ స్త్రీలకు ఉపయోగకరంగా ఉంటుంది.
బ్లూ / పర్పుల్
పర్పుల్ ద్రాక్షలు, వంగ, రేగు, బ్లూ బెర్రీలు, బ్లాక్ బెర్రీలు, ప్రూనే, ఎండుద్రాక్ష. ఈ పండ్లు మరియు కూరగాయలలో యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన స్ట్రోక్, గుండె వ్యాధులు మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బ్లూ బేర్రిలు తినటం వలన మెమరీ మెరుగుపడుతుంది.
తెలుపు
వెల్లుల్లి, కాలీఫ్లవర్, బంగాళ దుంపలు, టర్నిప్, అల్లం, అరటి, ఉల్లిపాయ, పుట్టగొడుగులు. దీనిలో 'అల్లిసిన్' అనే పోషకం ఉండుట వలన కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, రక్తపోటు మరియు కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అరటి మరియు బంగాళాదుంప రెండింటిలోను మెగ్నీషియం, పొటాషియం సమృద్దిగా ఉంటుంది. అంతేకాక వీటిలో ఉండే బీటా-గ్లూకాన్స్ వ్యాధి నిరోధక వ్యవస్థను పెంచటానికి సహాయపడతాయి. అందువలన మీ రోజువారీ ఆహారంలో ఈ పండ్లు,కూరగాయలు ఉండేలా చూసుకోండి.