ఈ కాలంలో పెదవులు పగలటం అనేది సాదారణమే. దీన్ని పట్టించుకోకుండా అలా వదిలేస్తే నల్లగా మారి అసహ్యంగా ఉంటాయి. అటువంటి సమస్య నుండి బయట పడాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
నిమ్మ చెక్కపై పంచదార జల్లి పెదవులపై గుండ్రంగా రుద్దాలి. ఈ విధంగా పది నిమిషాల పాటు చేసి చల్లని నీటితో కడిగితే పెదవుల తేమ పోకుండా ఉంటుంది.
ఆలివ్ ఆయిల్ ని రోజుకి రెండు సార్లు పెదవులపై రాసుకున్న మంచి పలితం కనపడుతుంది.
కొబ్బరినూనెలో రెండు మూడు స్పూన్ల నిమ్మరసం వేసి పెదవులకు రాసిన ఈ సమస్య నుండి బయట పడవచ్చు.
రోజూ పెదవులకు తేనె రాసుకుంటే అక్కడి చర్మం నుంచి తేమ వెళ్లిపోకుండా కాపాడుతుంది. అలాగే పగిలిన పెదవులకు ఇన్‌ఫెక్షన్ రాకుండా కూడా తేనె సహాయపడుతుంది.
రోజూ రెండు సార్లు మీగడ రాసుకున్నా పెదవులు మృదువుగా తయారవుతాయి.