Latest News

Powered by Blogger.
Tuesday, 3 November 2015

మైగ్రేన్‌ తలనొప్పి అసలు ఎందుకు వస్తుంది? దాని ఉపశమనం కొరకు కొన్ని ఇంటి చిట్కాలు

మైగ్రేన్ తలనొప్పిని తలచుకుంటేనే చాలా మంది వణికిపోతారు. ఆ బాధ ఆ స్థాయిలో ఉంటుంది . దీన్ని రక్తనాళాల నొప్పి అని కూడా అంటారు. అంటే రక్తనాళాలు విస్తరించడం(సైజు పెరగడం)వల్ల కొన్ని రకాల రసాయనాలు మెదడులో విడుదలవుతాయి. దానివల్ల ధమనులు ఉబ్బిపోయి మైగ్రేన్ నొప్పి వస్తుంది. ఇది తరచుగా వచ్చే ఉధృతమైన తలనొప్పి. ఎక్కువ శాతం వారసత్వంగా వచ్చే సమస్య ఇది. ముఖ్యంగా ఆడవారి ద్వారా సంతానానికి వస్తుంది. నొప్పి ఎక్కువ శాతం తలలో ఒకవైపున మాత్రమే వస్తుంది. అందుకే దీన్ని పార్శ్వపు నొప్పి అని కూడా పిలుస్తారు. ఇది ఆకస్మికంగా వచ్చే నొప్పి.

వ్యాధి నిర్ధారణ :

ఇది చిన్నవయసులో లేక యుక్తవయసులో ప్రారంభమవుతుంది. దీన్ని నిర్ధారించడానికి కుటుంబ ఆరోగ్య చరిత్ర ఉపయోగకరంగా ఉంటుంది. నొప్పి ఇంతకుముందెన్నడూ రానంత అధిక స్థాయిలో వస్తే, తలంతా తిరుగుతున్నట్లు, వాంతి వస్తున్నట్లు, కాంతిని చూడలేకపోవడం, శబ్దాలను వినలేకపోవడం, ఘాటైన వాసనలు పీల్చలేకపోవడం వంటి లక్షణాల ఆధారంగా మైగ్రే న్ నొప్పిని నిర్ధారిస్తారు. ఒక్కోసారి సిటిస్కాన్, ఎమ్ఆర్ఐ పరీక్షలు కూడా చేయిస్తారు.

కారణాలు :

ఒత్తిడి, మొదడుపై అధిక భారం, ఆందోళనలు, ఎసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం, అధికంగా పొగత్రాగడం, మద్యం సేవించడం, బ్లడ్ షుగర్, రక్తపోటు తక్కువగా ఉండడం, శారీరక బలహీనత, మహిళల్లో రుతుచక్రం, పోషకాహార లోపం, తగినంత విశ్రాంతి లేకుండా గంటలపాటు పనిలో మునిగిపోవడం మైగ్రేన్ నొప్పికి కారణమవుతాయి

ఇంటి చిట్కాలు

10 నుంచి 12 బాదం గింజలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఒక కప్పు ద్రాక్షరసం తీసుకున్నా ప్రయోజనకరముగా ఉంటుంది.

మూడు చెంచాల నీటిలో ఒక చెంచా ఆవపిండిని కలుపుకుని కొన్ని చుక్కలు ముక్కు రంధ్రాల్లో వేసుకోవాలి. దీనివల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

క్యాబేజీ ఆకులు కొన్ని తీసుకుని వాటిని నలిపి ఒక వస్త్రంలో వేసుకుని తలపై ఉంచుకోవాలి. తేమ ఆరిన వెంటనే మరికొన్ని తాజా ఆకులను తీసకుని మరలా అదే విధంగా చేయాలి. ఈ విధంగా చేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

నిమ్మ తొక్కలు కూడా చక్కగా ఉపయోగపడతాయి. పచ్చి నిమ్మకాయ తొక్కలను గుజ్జుగా చేసి దాన్ని తలపై రాసుకుంటే మైగ్రేన్ నొప్పి ఉపశమనం కలుగుతుంది.

ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. అధిక వేడి, కారం ఉప్పు పదార్థాలు, పుల్లగా ఉండే పండ్లను తినకుండా ఉండడం చాలా మంచిది.

తల మర్ధన చేసుకోవడం, ఎక్కువ కాంతికి గురికాకుండా జాగ్రత్త పడాలి.

  • Title : మైగ్రేన్‌ తలనొప్పి అసలు ఎందుకు వస్తుంది? దాని ఉపశమనం కొరకు కొన్ని ఇంటి చిట్కాలు
  • Posted by :
  • Date : 8:29 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top