మధుమేహం ఉన్న వారి ఆహారం
మధుమేహం లేని వ్యక్తి హానికారక పదార్ధాలు తీసుకుంటే వాటి దుష్ప్రభావం తొందరగా కనపడదు. అదే మధుమేహం ఉన్న వారిలో అది వేంటనే కనపడుతుంది. ఇదొక్కటే తేడా. మధుమేహం ఉన్న వారికీ ప్రత్యేకంగా చెప్పినా ఈ నియమాలను అందరూ పాటించవలసినవే.
ఎన్నిసార్లు భోంచేయాలి?
భోజనానికీ భోజనానికీ మధ్య ఎక్కువ వ్యవధి ఉండకూడదు. ఎక్కువ గంటలు గడిచే కొద్దీ రక్తంలో చక్కెర శాతం పూర్తిగా తగ్గిపోయి భోజనం చేయగానే హఠాత్తుగా పెరిగిపోతుంది. అందుకే భోజనాన్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా మూడు వేళలకు విభజించడం అవసరం. వీటికి తోడు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 5 గంటలకు అల్పాహారం తీసుకోవడం కూడా అవసరం. దీని వల్ల చక్కెర శాతంలో హెచ్చుతగ్గులు లేకుండా నియంత్రణలో ఉంటాయి.
ఇతరుల్లాగే మధుమేహం ఉన్నవారికి సైతం అన్ని రకాల ఆహార పదార్ధాల అవసరం ఉంటుంది. కాకపోతే, మధుమేహం ఉన్నవారు త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్ధాల (కార్బోహైడ్రేట్లు) తీసుకోకూడదు. అలా తీసుకుంటే చక్కెర శాతం చాలా వేగంగా పెరుగుతుంది. ఇన్సులిన్ లోపాలు ఉండడం లేదా అది సక్రమంగా పనిచేయకపోవడమే అందుకు కారణం. అందుకే చక్కెర, స్వీట్లు, పళ్లరసాలు, అరటి పళ్లు, మామిడి, ద్రాక్ష, శీతల పానీయాలు, చాక్లెట్లు, బియ్యం వంటి వాటిని అతి తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
బియ్యంలో అన్నిటికన్నా అతి త్వరగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మధుమేహులకు ఇవి విషతుల్యమని కాదు. కానీ, అపరిమితంగా తీసుకోవడం వల్ల చక్కెర శాతం విపరీతంగా పెరుగుతుంది. గోధుమ మొక్కజొన్న వంటి తృణధాన్యాలు, కూరగాయలు లేదా పళ్లల్లోనూ కావలసినన్ని కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. మొలకెత్తిన ధాన్యాలు, కూరగాయలు లేదా పళ్లల్లోనూ కావలసినన్ని కార్బోహైడ్రేట్లు లభిస్తాయి.