కొంత మందిలో గాయాలు మానినట్టేమాని మళ్లీ తిరగబెడుతూ ఉంటాయి. చాలా కాలంగా వేధిస్తున్న గాయాల వల్ల మరి కొంత మంది శరీర భాగాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇటువంటి గాయాలు పూర్తిగా మానడానికి పరిశోధకులు ఒక మందును కనిపెట్టారు. పుదీనా నూనె, దాల్చిన చెక్క కలిపి ఒక మందును తయారుచేశారు. ఈ మందు గాయాల్లో ఉండే హానికరమైన క్రిములను నాశనం చేస్తుంది.
అలాగే గాయాలు అతి త్వరగా మానేలా చేస్తుంది. గాయాల వద్ద ఉండే బ్యాక్టీరియా, క్రిములను సంప్రదాయ పద్ధతుల ద్వారా పూర్తిగా తొలగించలేము. అందువల్ల కొన్నిసార్లు గాయాలు ఏర్పడిన అవయవాలను కూడా తీసేయాల్సి వస్తుంది. పుదీనా నూనె, సిన్నమాల్డిహైడ్‌లున్న ఈ ఔషధం గాయాల్లో ఉండిపోయిన మట్టిని పూర్తిగా తొలగిస్తుంది. ‘‘ఈ క్యాప్సూల్స్ చికిత్స ద్వారా నాలుగు రకాల బ్యాక్టీరియాలను, ఇతర క్రిములను నాశనం చేయవచ్చు. అలాగే గాయాలు మానడంలో తోడ్పడే ఫైబ్రోబ్లాస్ట్స్ అనే శరీర కణాల ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది’’ అని పరిశోధకులు చెబుతున్నారు.