Latest News

Powered by Blogger.
Thursday, 16 July 2015

డార్క్ చాక్లెట్ అందాన్ని పెంచుతుందని తెలుసా?

చాక్లెట్‌ కనిపించగానే ఎప్పుడెప్పుడు తిందామా అనే కోరిక కలగటం సహజం. ఇది నోరూరించడంలోనే కాదు.. అందానికి వన్నెలద్దడంలోనూ చాక్లెట్లు మంచి పనితనం చూపిస్తాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, మెగ్నీషియం ముఖాన్నీ మెరిపించేలా చేస్తాయి. చాక్లెట్‌లో ఉండే యాంటాక్సిడెంట్లు చర్మానికి తగినంత తేమను అందించి చర్మం ఎల్లప్పుడూ తాజాగా ఉండేలా చేస్తాయి. 

యాభై గ్రాముల చాక్లెట్‌ పొడిలో తగినన్ని నీళ్లు పోసి చిక్కగా అయ్యేవరకు మరిగించాలి. దీనికి ఆలివ్‌ నూనె, గుడ్డులోని పచ్చసొన వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లయ్‌ చేసి 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.

చాక్లెట్‌ పొడిలో నీళ్లు పోసి మరిగించాలి. తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు, పాలు పోసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఇందులోని ఉప్పు మృతకణాలను తొలిగించేందుకు దోహదం చేస్తుంది. దీన్ని ముఖానికి బాగా పట్టించి పదిహేను నిమిషాల తర్వాత ఫేస్‌వాష్‌ చేసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది. చాక్లెట్‌ ప్యాక్‌తో మొటిమలు దూరమవుతాయి. ఎండ తీవ్రతకు చర్మాన్ని కందిపోకుండా చేస్తుంది.

చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్లు, విటమిన్‌-ఎ, ఇ సమపాళ్లలో ఉంటాయి. ఇవి వయసుతో పాటు చర్మంపై వచ్చే ముడతలు కనిపించకుండా చేస్తాయి. వారానికి రెండుసార్లు చాక్లెట్‌ ప్యాక్‌ వేసుకుంటే చర్మం ఎంతగానో నిగారిస్తుంది.

  • Blogger Comments
  • Facebook Comments
Top