మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ మొలకలను అన్ని వయస్సుల వారు తీసుకోవచ్చు. ఇప్పుడు పెసలు,బఠానీలు,సెనగ మొలకలలో ఉన్న పోషకాలను తెలుసుకుందాం.
పెసలు
పెసల మొలకలలో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. జుట్టు పెరుగుదలకు విటమిన్ సి బాగా సహాయపడుతుంది. అంతేకాక శరీరంలో వ్యర్ధాలను దూరం చేసే లక్షణాలు ఉన్నాయి. ఈ మొలకలలో ఉండే ఫోలేట్ గర్భిణిలకు,గర్భస్థ శిశువుకు చాలా మేలు చేస్తుంది. వీటిని సాధ్యమైనంత వరకు ఉదయం బ్రేక్ ఫస్ట్ లో తీసుకుంటే మంచిది. వీటిని తినటం వలన రోగనిరోదక శక్తి పెరిగి ఇన్ ఫెక్షన్స్ దూరం అవుతాయి. అయితే ఈ మొలకలను ఎక్కువగా తింటే గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది.
బఠానీ
వీటిలో కార్భో హైడ్రేడ్ అధికంగా ఉంటాయి. అందువల్ల వ్యాయామానికి ముందు ఈ మొలకలను తింటే తక్షణ శక్తి అందుతుంది. ఈ మొలకలలో పీచు అధికంగా ఉండుట వలన కడుపు నిండినా భావన కలుగుతుంది. దాంతో ఆకలి తొందరగా వేయదు. అంతేకాక చక్కర స్థాయిలను అదుపులో ఉంచటమే కాకుండా చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
శెనగలు
వీటిలో కూడా కార్భో హైడ్రేడ్ అధికంగా ఉంటాయి. అలాగే B6 కూడా సమృద్దిగా ఉంటుంది. ఇది తగ్గాలని అనుకొనే వారికీ మంచి ఆహారం. ఈ మొలకల్లో కొలస్ట్రాల్ ఉండదు. చర్మ వ్యాధులు,అలర్జీ లు తగ్గుతాయి. మధుమేహం ఉన్నవారు సెనగ మొలకలను తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి.