Latest News

Powered by Blogger.
Sunday, 10 April 2016

బీపీ చూపించుకొనే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

హై బీపీ ఉన్నవారు తరచుగా బీపీ ని చెక్ చేయించుకోవటం మంచిది. కాబట్టి బీపీని ఎలా కొలుచుకోవాలో నేర్చుకొని స్వంతంగా చూసుకోవటం మంచిది. లేకపోతె నర్సులను పిలిచి చూపించుకోవచ్చు. 

కాఫీ త్రాగిన అరగంట తర్వాత మాత్రమే బీపీని కొలవాలి. అలాగే ఆహారం తీసుకున్న వెంటనే మరియు వ్యాయామం చేసిన వెంటనే బీపీని కొలవకూడదు. కొంచెం సేపు విశ్రాంతిగా ఉన్న సమయంలో మాత్రమే కొలవాలి.

రెండు నిమిషాల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు కొలిచి, వాటి సగటు తీసుకోవాలి. వీటిని తేదీ, సమయంతో ఒక పుస్తకంలో రాయాలి.

మొదటిసారి కొలిచినప్పుడు కొంచెం ఎక్కువగా ఉన్నా కంగారు పడవలసిన అవసరం లేదు. మరల కొంచెం సేపు ఆగి కొలవాలి. అలా కొన్ని సార్లు కొలిచి, అన్నింటిలోనూ ఎక్కువే ఉంటే అప్పుడు వైద్యులను సంప్రదించాలి.

మొదట్లో వారం పాటు ఉదయం, సాయంత్రం ఒకే సమయానికి కొలిచి చూడటం వల్ల బీపీ సాధారణంగా ఎలా ఉంటోందో పరిస్థితి అర్థమవుతుంది.

ఎలా కొలవాలి?
టేబుల్‌ ముందు నిదానంగా కూర్చోవాలి.
ప్రశాంతంగా మాట్లాడకుండా ఉండాలి.
వెనక బాగం ఆనుకునేలా ఉంటే మంచిది.
కాళ్లు వంకర్లు లేకుండా నిటారుగా పెట్టాలి.
పాదాలు నేల మీద పూర్తిగా ఆనించి ఉంచాలి.
చేతిని గాలిలో ఉంచకుండా కింద ఆధారం ఉండాలి.
గాలి కఫ్‌ను- గుండెకు సమాన ఎత్తులో, మరీ బిగుతుగా లేకుండా కట్టాలి
చొక్కా, జాకెట్‌ వంటివి పైకి తీసి, మోచేతి ముడతకు 3 సెం.మీ. పైన కట్టటం మంచిది.

  • Title : బీపీ చూపించుకొనే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
  • Posted by :
  • Date : 10:28 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top