Latest News

Powered by Blogger.
Saturday, 23 April 2016

వేసవిలో వచ్చే తలనొప్పి తగ్గాలంటే...చిట్కాలు

వేసవి కాలం వచ్చిందంటే ఆ వేడికి తలనొప్పి రావటం ఖాయం. అలాగే చుండ్రు సమస్య కూడా వేదిస్తుంది. వీటికి చెక్ పెట్టాలంటే గోరింటాకును ఉపయోగించాలి.

ఒక పాన్ లో రెండు స్పూన్ల ఆవనూనెను పోసి వేడిచేయాలి. నూనె వేడెక్కాక గోరింటాకు వేసి బాగా వేగించి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని తల మాడుకు రాసుకొని మసాజ్ చేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. 

నీటిని మరగబెట్టి దానిలో గోరింటాకు వేసి బాగా ఉడికిన తర్వాత ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా అయ్యాక ఆ నీటిని తల మాడుకు మసాజ్ చేసుకుంటే వేడి తగ్గి మాడు చల్లబడుతుంది. ఈ విధంగా చేయటం వలన జుట్టు మృదువుగా మారుతుంది. 

ఎండాకాలంలో వచ్చే తీవ్రమైన తలనొప్పికి గోరింటాకుతో పాటు వాటి పువ్వులు కూడా బాగా సహాయపడతాయి. గోరింటాకు ఆకులు, పువ్వులు వెనిగర్ లో కొంచెం సేపు నానబెట్టి మెత్తని పేస్ట్ చేసి కనతల రాసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన శరీరంలో వేడి తగ్గి తలనొప్పి తీవ్రత తగ్గుతుంది.

      • Blogger Comments
      • Facebook Comments
      Top