Latest News

Powered by Blogger.
Sunday, 28 February 2016

పెదాల పగుళ్ళు తగ్గి మృదువుగా మారాలంటే...

పెదాలు పొడిబారి చర్మం పొట్టులా ఊడటం, పగుళ్ళు ఏర్పడటం అనేది సహజంగానే జరుగుతుంది. ఈ సమస్య నుండి బయట పడి మృదువైన పెదాలను సొంతం చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలను పాటించాలి.

కొబ్బరినూనె
పెదాలపై పగుళ్ళు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు దురదగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో పెదాలకు గోరువెచ్చని కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. ఈ విధంగా చేయుట వలన దురద తగ్గటమే కాకుండా పెదాలు తాజాగా ఉంటాయి.

తేనె
టాన్‌ చేరడం వల్ల పెదాలు నల్లగా మారతాయి. అటువంటి సమయంలో పెదాలను తేనెతో మసాజ్ చేసుకోవాలి. వీలు ఉంటే కాస్త పంచదార కూడా అద్ది మృదువుగా మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధంగా చేయుట వలన టాన్‌ వదిలిపోయి పెదాలు తాజాగా మారతాయి.

నెయ్యి
నెయ్యి కూడా పెదాలను మృదువుగా మార్చటంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు నెయ్యి ని పెదాలకు రాసి కొంచెం సేపు మసాజ్‌ చేస్తే మంటా, నొప్పీ తగ్గుతాయి. అంతేకాక పగుళ్లు బాధించవు.

  • Blogger Comments
  • Facebook Comments
Top