Latest News

Powered by Blogger.
Thursday, 28 January 2016

కొంత మందికి బీపీ పెరుగుతుంది, కొంత మందికి తగ్గుతుంది. కారణాలేంటి?

బీపీ లేదా బ్లడ్‌ ప్రెషర్‌ అంటే అర్థం మన శరీరంలో ఎంత ఒత్తిడిలో రక్త ప్రవాహం జరుగుతుందో తెలుపుతుంది. మన శరీరంలో గుండె నుండి రక్తాన్ని వివిధ ప్రాంతాలకు సరపరా చేస్తుంది. శరీరంలో రక్తం ఎంత పీడనంతో ప్రవహిస్తోందో సరాసరి తెలుసుకోవడం కష్టం. కాబట్టి వైద్యులు బయటనుంచి కృత్రిమంగా పీడనాన్ని శరీరంపై కలిగించి ఏ పీడనం దగ్గర శరీరంలో రక్తప్రవాహం ఆగిపోతుందో తెలుసుకుంటారు. ఆ పీడనాన్ని సిస్టోలిక్‌ పీడనం అంటారు. ఇది దాదాపు 120 (మి.మీ పాదరసం) ఉంటుంది. 

ఆ పిదప బయట ఒత్తిడిని తిరిగి క్రమేపీ తగ్గిస్తూ పోతే ఏ పీడనం దగ్గర తిరిగి రక్తప్రవాహం పునః ప్రారంభం అవుతుందో తెలుసుకుంటారు. దీన్ని డయాస్టోలిక్‌ పీడనం అంటారు. ఇది దాదాపు 80 మి.మీ పాదరసం ఉంటుంది. ఈ రెండు విలువలు కలిపి 120/80గా ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తపోటుగా చెప్పుతారు. 

ఒకవేళ గుండె జబ్బులు ఉన్నా , రక్తనాళాలు సన్నబడినా, అధిక బరువు ఉన్నా శరీర భాగాలకు రక్తం చేరవేసేందుకు గుండె అదనపు బలాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడు రక్త పీడనం పెరుగుతుంది.  చిరుతిళ్లు,మసాలాలు అధిక మోతాదులో నూనెలు, ఉప్పు తినే వాళ్లలో అధిక రక్తపోటు వస్తుంది. ఆందోళనలు ఎక్కువగా ఉన్నప్పుడు  మెదడు గుండెను అధిక పీడనంతో పనిచేసేలా ఉద్రేకపరుస్తుంది. అందువల్ల  హైబీపీని నివారించటానికి వ్యాయామం, ఆహారపు అలవాట్లు, ప్రశాంతమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. 

  • Title : కొంత మందికి బీపీ పెరుగుతుంది, కొంత మందికి తగ్గుతుంది. కారణాలేంటి?
  • Posted by :
  • Date : 6:00 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top