Latest News

Powered by Blogger.
Wednesday, 13 January 2016

ప్రొస్టేట్‌ వ్యాధిని గుర్తించేదెలా? లక్షణాలు గురించి తెలుసుకుందాం

ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రొస్టేట్‌ కేన్సర్ల బారిన పడే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఈ కేన్సర్‌ రావడానికి వ్యాధి లక్షణాల గురించిన సరైన అవగాహన లేకపోవడం ఒక కారణం అయితే, అనుమానం కలిగినా సమస్య  ప్రారంభంలో ఉన్నప్పుడే  వైద్యుణ్ని సంప్రదించకపోవడం మరో కారణం. అయితే  ప్రొస్టేట్‌ కేన్సర్‌ రావడానికి సరైన కారణాలు ఇప్పటి వరకూ తెలియకపోవడం అసలు సమస్యగా ఉంది. ఏమైనా వ్యాధి లక్షణాల అవగాహనతో సమస్య తొలిదశలోనే నిపుణులైన డాక్టర్లను సంప్రదిస్తే సమస్యను ఆదిలోనే అంతమొందించవచ్చు.

పౌరుష గ్రంధి, అస్థిల గ్రంధి, ప్రోస్టేట్‌ గ్రంధి ఇలా పలుపేర్లతో పిలవబడే ఈ గ్రంధి పురుషులకు నిజంగా అత్యంత కీలకమైనది. మూత్రాశయం కింద ఉసిరికాయ పరిమాణంలో మూత్ర మార్గం చుట్టూ ఇది ఆవరించి ఉంటుంది. ఈ గ్రంధి వీర్య ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. సంతానాకి బీజాంకురాలుగా, వృషణాల్లో ఉత్పత్తి అయ్యే శుక్ర కణాలు ఈ ప్రోస్టేట్‌ గ్రంధిలో తయార య్యే స్రావాలతో కలిసి వీర్య రూపం దాల్చి సంతానాన్ని కలిగిస్తుంది. అందుకే ప్రొస్టేట్‌ గ్రంధికి అంతటి ప్రాధాన్యత ఉంది.

వయస్సుతో పాటే...

పురుషుల్లో వయసు పెరిగే కొద్దీ ఇది పెరగడం మొదలవుతుంది. అలా మూత్ర విసర్జనలో పలు రకాల సమస్యలు మొదలవుతాయి. దీన్ని బినైన్ ప్రొస్టేటిక్‌ హైపర్‌ ప్లేసియా అంటారు. ఇది ఇబ్బంది పెట్టేదే కాని, ప్రమాదకరమైనది కాదు. అయితే కొందరిలో ఇది ప్రొస్టేట్‌ కేన్సర్‌గా కూడా మారవచ్చు. దీన్ని ముందే గుర్తించే స్ర్కీనింగ్‌ పరీక్షల గురించిన అవగాహన లేకపోవడం వల్ల కేన్సర్‌, ప్రొస్టేట్‌ను దాటి ఎముకలకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ముందుగానే గుర్తిస్తే సమస్యను నియంత్రించడం గానీ, నయం చేయడంగానీ సులభమవుతుంది. అందుకే పెద్ద వయసు వారిలో మూత్ర సమస్యలు వచ్చినప్పుడు కేన్సర్‌ కాదని నిర్ధారించుకోవడం అవసరం.

సాధారణంగా ఈ సమస్య వృద్ధుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. 40 ఏళ్ల లోపు వారిలో ఈ సమస్య రావడం చాలా అరుదు. బ్యాటరీ పరిశ్రమల్లోని కాలుష్యాలకు లోనయ్యే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి ఈ వ్యాధి రావడానికి గల స్పష్టమైన కారణమేదీ ఇప్పటి వరకూ తెలియదు. అయితే, కొవ్వు పదార్థాలు విరివిగా తీసుకునే వారు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతున్నారనేది వాస్తవం.

వ్యాధి లక్షణాలు

ప్రొస్టేట్‌లో వాపు ఏర్పడినప్పుడు తరుచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం
మూత్ర విసర్జన కష్టంగా ఉండడం, మూత్రం బొట్లు బొట్లుగా రావడం
మూత్రాన్ని ఆపుకోలేకపోవడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.
ఈ లక్షణాలున్న వారిలో కేన్సర్‌ ఉందేమో పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి.

గుర్తించేదెలా?
వయసు పెరుగుతున్న కొద్దీ పి.ఎన్.ఏ స్థాయి పెరుగుతుంది. ఉదాహరణకు 40 నుంచి 50 ఏళ్ల వరకు 0-2.5 ఉంటే నార్మల్‌. ఒకవేళ పి.ఎన్.ఏ 4 ఉంటే ప్రమాదం. అందుకే 50 ఏళ్లు దాటిన ప్రతి పురుషుడూ ప్రతి ఏటా పిఎన్ఏ పరీక్ష చేయుంచుకోవాలి. ఈ పరీక్షలో ప్రొస్టేట్‌ గ్రంధి పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా, గ్రంధి గట్టిగా మారినా డిజిటల్‌ రెక్టార్‌ ఎగ్జామినేషన్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేయాలి. కేన్సర్‌ ఉన్నట్లు అనుమానం కలిగితే ముక్క పరీక్ష (బయాప్సీ) చేయించాలి. అవసరమైన వైద్య చికిత్సలన్నీ జాప్యం చేయకుండా తీసుకుంటే వ్యాధి నుంచి విముక్తి పొందే అవకాశాలు పెరుగుతాయి.

  • Title : ప్రొస్టేట్‌ వ్యాధిని గుర్తించేదెలా? లక్షణాలు గురించి తెలుసుకుందాం
  • Posted by :
  • Date : 8:27 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top