Latest News

Powered by Blogger.
Friday, 4 September 2015

దుస్తులపై మొండి మరకలు పోవటానికి సులభమైన చిట్కాలు

మనకు ఎంతో ఇష్టమైన డ్రెస్‌పై మొండి మరకలు పడితే తట్టుకోలేము. వాటిని తొలగించడానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం. అయితే ఒక్కో మరకను తొలగించడానికి ఒక్కో పద్ధతి ఉంటుంది. 

దుస్తులపై పడిన కాఫీ, టీ మరకలపై టాల్కమ్‌ పౌడర్‌ చల్లి లేదా పంచదార కలిపిన నీటిలో మరక పడిన ప్రదేశం వరకూ ముంచి ఆ తరువాత డెటర్జెంట్‌తో ఉతకాలి.

పండ్ల రసాలు, ఐస్‌క్రీమ్‌ మరకలను నిమ్మరసంతో రుద్దడం ద్వారా తొలగించవచ్చు. చొక్కా కాలర్‌పై, తలగడల కవర్లపై పడే మరకలను షాంపూతో ఉతకడం ద్వారా పోగొట్టవచ్చు.

దుస్తులపై పడిన రక్తం మరకను తొలగించాలంటే దాన్ని తడిచేసి ఉప్పు చల్లి, గట్టిగా రుద్దాలి. తరువాత డిటర్జెంట్‌తో ఉతకాలి. 

ఇంక్‌ మరకలు పోవడానికి ఆ ప్రదేశాన్ని ఆల్కహాల్‌తో రుద్ది ఆ తరువాత ఉతకాలి. ఆల్కహాల్‌ని ఉపయోగించి డియోడ్రెంట్ల వల్ల ఏర్పడే మొండి మరకలను కూడా తొలగించవచ్చు.

మరకలపై పాల చుక్కలు వేసుకుంటూ టూత్‌ బ్రష్‌తో గట్టిగా రుద్దడం ద్వారా కూడా ఇంక్‌ మరకలు పోతాయి.

గ్రీజు, నూనె వంటి మకరలను మొక్కజొన్న పిండిని ఉపయోగించి తొలగించవచ్చు.

వెనిగర్‌ని, వేడి నీటిని సమభాగాల్లో కలిపి దానిలో మరకలంటిన దుస్తులను కొద్దిసేపు నానబెట్టాలి. ఆ తరువాత బ్రష్‌తో రుద్ది ఉతికితే ఎటువంటి మరకలైనా పోతాయి.

  • Blogger Comments
  • Facebook Comments
Top